‘ఇండియన్ 3’ అప్డేట్.! ఇది నిజమేనా.?
- October 03, 2024
ఇటీవల భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఇండియన్ 2’ ఫలితం ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఇండియన్ 2’ తర్వాత మూడో పార్ట్ కూడా వుండబోతోందనీ అప్పుడే లీడ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అంతేకాదు, ‘ఇండియన్ 2’ ప్రమోషన్లలోనే ఈ సినిమా కన్నా ‘ఇండియన్ 3’ ఇంకా బాగుంటుందని కమల్ హాసన్ చెప్పడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి కూడా తెలిసిందే.
అయితే, ఆ సంగతి అటుంచితే.. ‘ఇండియన్ 3’ విషయంలో ఓ సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ సినిమాని ఓటీటీ బేస్ చేసుకుని రూపొందిస్తున్నారట. డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనీ తెలుస్తోంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమాని విడుదల చేసేందుకు మంతనాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ‘ఇండియన్ 2’ విషయంలో నిర్మాతలు దారుణంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆయా పరిస్థితుల్ని దృష్టిలో వుంచుకుని ఎటువంటి రిస్క్ చేయకుండా ‘ఇండియన్ 3’ని ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో.!
తాజా వార్తలు
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!
- సౌదీ అరేబియాలో స్థిరంగా ద్రవ్యోల్బణం..!!
- ఖర్జూర సాగు అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!







