బిగ్‌బాస్: మణికంఠ సింపతీ నాన్సెన్స్.!

- October 03, 2024 , by Maagulf
బిగ్‌బాస్: మణికంఠ సింపతీ నాన్సెన్స్.!

14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ సీజన్ తెలుగు బిగ్‌బాస్ గేమ్ షో ప్రస్తుతం 9 మంది కంటెస్టెంట్లతో రన్ అవుతోంది. ఐదు వారాల ఎలిమినేషన్స్ తర్వాత హౌస్‌లో ఒకింత హోరా హోరీ పోరాటం నడుస్తోంది.

కాగా, కంటెస్టెంట్లలో ఒకరైన నాగ మణికంఠ మొదటి నుంచీ కాస్త క్రిటికల్‌గానే అనిపిస్తున్నాడు. తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాల్ని పదే పదే నొక్కి వక్కానిస్తూ హౌస్ మేట్స్ మధ్య సింపతీ క్రియేట్ చేసుకున్నాడు.

అదే సింపతీని ఆడియన్స్‌లోనూ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రతీ వారం. ప్రతీ వారం ఆ సింపతీనే మణికంఠని ఎలిమినేషన్స్ నుంచి తప్పిస్తుందో ఏమో తెలీదు కానీ, వీక్షకులకు హౌస్‌లో మణికంఠ తీరు చికాకు పుట్టిస్తోంది.

అనవసరమైన ఇంటరప్షన్స్ తీసుకుంటాడు. హౌస్ మొత్తం తనను టార్గెట్ చేస్తోందంటాడు. టాస్కుల్లో ఫెయిలవుతుంటాడు. కానీ, ఒప్పుకోడు. నామినేషన్ రీజన్స్‌లోనూ చెత్త వాదనలతో విసుగు పుట్టిస్తుంటాడు.

అయినా కానీ, ఎందుకు మణికంఠ ప్రతీ వారం సేవ్ అవుతూ వస్తున్నాడు.? నిజంగానే ప్రేక్షకులు సేవ్ చేస్తున్నారా.? లేదంటే ఏదైనా సర్‌ప్రైజింగ్ ప్యాకేజీ మణికంఠ సెట్ చేసుకుని వచ్చాడా.? అని వీక్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి చికాకు పుట్టించినా మణికంఠ తీరు కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తుంటుందనుకోండి.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com