‘మట్కా’.! రెట్రో లుక్స్‌తో కిర్రాకెత్తిస్తున్న మెగా రాకుమారుడు.!
- October 15, 2024
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో ‘మట్కా’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కరుణ్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు.
నవంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమా నుంచి లేటెస్ట్గా ఓ సాంగ్ రిలీజ్ చేశారు.
నోరా ఫతేహి నర్తించిన ఈ స్పెషల్ సాంగ్‌లో ‘లే రాజా.. ’ అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయ్. ఇక, పాటలో వరుణ్ తేజ్ రెట్రో లుక్స్ కిర్రాకెత్తిస్తున్నాయ్. 20వ సెంచరీ నాటి గ్యాంబ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ మధ్య వరుణ్ తేజ్‌కి కలిసొచ్చిన సినిమాలేం లేవు. కానీ, ‘మట్కా’ సినిమాపై అంచనాలున్నాయ్. ‘గద్దల కొండ గణేష్’ తరహాలో ఈ సినిమా వరుణ్ తేజ్‌కి మంచి హిట్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా వుంది. ఆ నేపథ్యంలోనే లేటెస్ట్ స్పెషల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఆల్రెడీ గతంలో ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్లకు పాజిటివ్ రెస్సాన్స్ వున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







