మళ్లీ బిజీ అవుతోన్న నభా నటేష్.!
- October 15, 2024
‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నభా నటేష్. ఆ తర్వాత ‘అల్లుడు అదుర్స్’ తదితర చిత్రాల్లో నటించింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా నభాకి మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే, ఆ తర్వాత అనూహ్యంగా యాక్సిడెంట్ అయ్యి కొన్ని నెలల పాటు సినిమాలకు దూరమైంది.
మళ్లీ ఈ మధ్యనే వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. లేటెస్ట్గా ‘డార్లింగ్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది.
అయితే, ప్రస్తుతం నభా నటేష్ చేతిలో రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులున్నాయ్. అందులో ఒకటి నిఖిల్ హీరోగా వస్తున్న ‘స్వయంభు’ కాగా, మరో సినిమా ‘నాగబంధం’. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ‘పెదకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్నాడు.
నభా నటేష్‌తో పాటూ, ఐశ్వర్యా మీనన్ లీడ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. వెరీ లేటెస్ట్గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ లాంఛింగ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసి టీమ్‌ని ఆశీర్వదించారు. ‘డెవిల్’ ఫేమ్ అభిషేక్ నామా ఈ సినిమాకి దర్శకుడు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!