‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది..
- October 30, 2024
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘హనుమాన్’.ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా విజయాన్ని అందుకుంది.ఈ చిత్రానికి సీక్వెల్‌గా శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి అనే ప్రశ్నకు సమాధానంగా ‘జై హనుమాన్’ చిత్రం తెరకెక్కుతోంది.ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ మూవీలో హనుమంతుడి పాత్రను ఎవరు పోషిస్తారు? అన్న ప్రశ్నకు సమాధానం లభించింది.
తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటించారు. రిషబ్ శెట్టి హనుమంతుడి గెటప్ అదిరిపోయింది. కాంతారతో పాన్ ఇండియా లెవల్‌లో ఫేం తెచ్చుకున్న రిషభ్ శెట్టి ఇప్పుడీ పాన్ ఇండియా సక్సెస్ ఫుల్ మూవీ సీక్వెల్ లో భాగం కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!