ప్రైమ్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా బహ్రెయిన్
- June 23, 2016
బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ చేపట్టిన లాంగ్ టెర్మ్ టూరిజం స్ట్రేటజీ కారణంగా అతి త్వరలో బహ్రెయిన్, ప్రైమ్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మారనుంది. దీనికి సంబంధించి 2016-17 యాక్షన్ ప్లాన్‌ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వెడ్డింగ్ ప్లానర్స్, ఫ్యాషన్ డిజైనర్స్, ఫ్లోరిస్టులు, ఈ రంగంలోని భాగస్వాములు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీడియాకి తమ తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. ఫ్యాషన్, మ్యూజిక్ మరియు మేకప్ విభాగాల్లో లోకల్ టాలెంట్‌ని ప్రమోట్ చేయడం ద్వారా కింగ్‌డమ్‌ని వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మార్చడమెలాగన్నదానిపై ఈ యాక్షన్ ప్లాన్‌లో పేర్కొన్నారు. దేశంలో అనేక టూరిజం డెస్టినేషన్స్ ఉన్నాయనీ, వాటిని వెడ్డింగ్ డెస్టినేషన్స్‌గా వినియోగించుకునేందుకు ఔత్సాహికులు ముందుకొస్తున్నారనీ, వారి అవసరాలకు తగ్గట్లుగా తగిన సౌకర్యాలు కల్పించాల్సి ఉందని బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ ఖలీద్ బిన్ హుమూద్ అల్ ఖలీఫా చెప్పారు. వెడ్డింగ్ ప్లానర్స్ కోసం త్వరలో వర్క్‌షాప్‌ని తమ అథారిటీ నిర్వహిస్తుందనీ, అలాగే వార్షిక జ్యుయెలరీ అరేబియా ఎగ్జిబిషన్‌లో పాల్గొంటామని, అతి పెద్ద వెడ్డింగ్ ఫెయిర్ ఈవెంట్‌లోనూ పాల్గొంటామని ఖలీఫా వివరించారు. థాయ్‌లాండ్‌లో ఈ వెడ్డింగ్ ఫెయిర్ జరగనుంది. ఎడారి, ఐలాండ్, మరియు బీచ్‌లలో వెడ్డింగ్ వెన్యూస్‌ని ప్రమోట్ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







