వాడిస్‌లో వాహనాల పార్కింగ్ చెయ్యొద్దు
- June 23, 2016
మస్కట్ మునిసిపాలిటీ కారు ఓనర్లు తమ వాహనాల్ని వాడిస్‌లో పార్కింగ్ చేయరాదని విజ్ఞప్తి చేసింది. తగినంత పార్కింగ్ సౌకర్యం ఉన్నా, కొందరు వాహనదారులు పార్కింగ్ చేయకూడని చోట పార్కింగ్ చేస్తున్నారని మునిసిపాలిటీ అధికారులు వివరించారు. మస్కట్ మునిసిపాలిటీ డైరెక్టర్ ఆఫ్ కార్ పార్కింగ్ మీటర్స్ ఖాలిద్ అల్ హాసిని మాట్లాడుతూ, వాహనదారులు కేటాయించబడిన పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే తమ వాహనాల్ని పార్కింగ్ చేయాల్సి ఉంటుందనీ, సిటీలో తగినన్ని పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయని చెప్పారు. మస్కట్‌లో పార్కింగ్ రుసుము చాలా తక్కువనీ, 30 నిమిషాల కోసం కేవలం 50 బైజా మాత్రమే వసూల చేస్తున్నామనీ, నెలకు 5 ఒమన్ రియాల్స్ చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కూడా ఉందని చెప్పారు ఖాలిద్ అల్ హాస్ని. అయితే పార్కింగ్ స్లాట్స్ ఎప్పుడూ బిజీగా ఉంటాయి కాబట్టే వాడిస్‌లో తమ వాహనాల్ని పార్క్ చేస్తున్నట్లు వినియోగదారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







