రమదాన్ 15 రోజులు: 70,000 ఒమన్ రియాల్స్ డొనేషన్స్
- June 23, 2016
పవిత్ర రమదాన్ మాసంలో పేదలకు సహాయం చేసేందుకోసం పలు స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాయి. ఈ క్రమంలో చారిటీ కార్యక్రమాన్ని చేపట్టాయి సంయుక్తంగా. దీనికోసం ఓ వెబ్ పోర్టల్‌ని ప్రారంభించాయి. కేవలం 15 రోజుల్లోనే 70,000 ఒమన్ రియాల్స్‌ని ఈ పోర్టల్ ద్వారా సేకరించారు. 1,682 మంది దాతలు ఈ మొత్తాన్ని అందజేశారు. మొత్తం 24 ఆర్గనైజేషన్స్‌లో ఒమన్ ఛారిటబుల్ ఆర్గనైజేషన్ అత్యధికంగా డొనేషన్లను సేకరించగలిగింది. ఆ తర్వాతి స్థానాల్లో అల్ రహ్మా ఛారిటీ టీమ్, సీబ్ అండ్ దార్ అల్ అట్టా నిలిచాయి. బుధవారం మధ్యాహ్నానికి 1,963 డోనర్స్ ద్వారా 81,916 ఒమన్ రియాల్స్‌ని సేకరించింది ఈ పోర్టల్. 2016 మొత్తానికి చూసుకుంటే బుధవారం నాటికి 228,925 ఒమన్ రియాల్స్ సేకరించగా, 2009లో పోర్టల్ లాంఛ్ చేసినప్పటినుంచి ఇప్పటిదాకా 1,755,428 ఒమన్ రియాల్స్‌ని సేకరించగలిగారు. పోర్టల్‌ని సంప్రదించే దాతలు, 30 విభాగాల్లో సహాయం అందించడానికి అవకాశం కల్పించారు. పే యువర్ జకా, జకత్ అల్ ఫితర్, ఫాస్టింగ్ ఫిద్యా ఎక్‌స్పిటేషన్, రమదాన్ ఇఫ్తార్ మీల్, డొనేషన్ ఫర్ ఈద్ క్లాత్స్, సదాకా, సిరియా హెల్ప్ క్యాంపెయిన్, ఆర్ఫాన్స్ కేర్, డొనేషన్స్ ఫర్ మసీద్, జనరల్ డొనేషన్స్, ఫ్యామిలీ కేర్, సోషల్ కేర్, ఇంటర్నేషనల్ రిలీఫ్, స్టూడెంట్ కేర్ మరియు మెడికల్ సపోర్ట్ అంటూ పలు విభాగాలు ఇందులో ఉన్నాయి. ఒమనీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు ఈ చెల్లింపులకు అర్హులు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







