జీడీపప్పును తీసుకునే ముందు షుగర్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
- November 04, 2024
జీడిపప్పు ఎంతో రుచిగా ఉంటుంది.అదే విధంగా, ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.అయితే, అందులో రక్తంలో చక్కెర స్థాయిలను ఎఫెక్ట్ చేసే కార్బోహైడ్రేట్స్, కేలరీలు కూడా ఉంటాయి. కాబట్టి, షుగర్ ఉన్నవారు జీడిపప్పు తినొచ్చా లేదా అనేది చాలా మందిని కన్ఫ్యూజన్ పెట్టే విషయం. జీడిపప్పులో ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే, షుగర్ ఉన్నవారు ఈ జీడిపప్పు తినొచ్చా.. లేదా అనే విషయాలను తెలుసుకోండి.
షుగర్ ఉన్నవారు జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.దీంతో గుండెజబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గిస్తాయి.అమి మీ రక్త నాళాలకి ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉంటాయి.గుండెజబ్బు అనేది షుగర్ ఉన్నవారికి వచ్చే సాధారణ సమస్య. కాబట్టి, జీడిపప్పులు తింటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
జీడిపప్పులో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.అవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి, స్పైక్స్‌ని నిరోధిస్తాయి. వీటిని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. ఇందులోని ఫైబర్ కారణంగా కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియ, శోషణ నెమ్మదిగా జరుగుతుంది. దీంతో రక్తంలో ఒకేసారిగా స్పైక్స్ పెరగవు.ఫైబర్ ఎక్కువసేపు కడుపుని నిండుగా ఉంచడంలో హెల్ప్ ఆకలి, క్రేవింగ్స్‌ని తగ్గిస్తుంది.దీంతో బరువు పెరగడం వంటి సమస్యలు కూడా ఉండవు.
జీడిపప్పులో కేలరీలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవి మిగతా నట్స్ కంటే చాలా ఎక్కువ. మీరు జీడిపప్పులు తింటే రోజువారీ కేలరీలు, కార్బోహైడ్రేట్స్ అవసరాలను తీర్చినట్టే. అయితే, వీటిని తక్కువగా తినాలి. అదే విధంగా, వీటిని ప్లెయిన్‌గానే తీసుకోవాలి.అంతేకానీ, ఉప్పు, చక్కెర వేసి ఫ్రై చేసినవి తీసుకోకూడదు.దీని వల్ల హైబీపి, రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.కాబట్టి, మీరు నేచురల్‌గా తినాలి.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!