జేవీ రమణమూర్తి అంతిమ సంస్కారాలు పూర్తి
- June 24, 2016
రెండ్రోజుల కిందట గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు, రంగస్థల కళాకారుడు జేవీ రమణమూర్తి అంత్యక్రియలు పూర్తయ్యాయి. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయన కుమారులు అరుణ్‌కుమార్, హర్షవర్దన్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు స్టార్ ఆసుపత్రి నుంచి రమణమూర్తి భౌతికకాయాన్ని అమీర్‌పేటలోని స్వగృహానికి తరలించారు. బంధువులు, కుటుంబ సన్నిహితులతో పాటు పలువురు సినీ నటులు, రంగస్థల నటులు రమణమూర్తి భౌతికకాయానికి నివాళులర్పించారు. నాటక, సినీ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకొని కంటతడి పెట్టారు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







