ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ తన పదవికి రాజీనామా..
- June 24, 2016
బ్రిటన్ ప్రజలు యురోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికే మొగ్గు చూపడంతో ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రెగ్జిట్ తుది ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలని ఆయన గట్టిగా ప్రచారం చేశారు. కానీ మెజార్టీ ప్రజలు ఆయన ఆకాంక్షకు వ్యతిరేకంగా ఓటేశారు. బ్రిటన్ ప్రజల తీర్పును తాను శిరసావహిస్తున్నానని కామెరాన్ ప్రకటించారు. ఈ ఫలితాలను తేలిగ్గా తీసుకోవడం లేదని అన్నారు. పదవి నుంచి వైదొలిగినా బ్రిటన్ ఒంటరిగా నిలదొక్కుకోవడానికి అవసరమైన అన్ని సహాయసహకారాలు అందిస్తానని ఆయన చెప్పారు. ఇంతకాలం ప్రధానిగా పనిచేసినందుకు గర్వంగా ఉందని కామెరాన్ అన్నారు. ఈయూతో మళ్లీ సంప్రదింపుల కోసం ఉద్దేశించిన లిస్బన్ ఒప్పందంలోని ఆర్టికల్ 50ని తాను ప్రయోగించబోనని, కొత్త ప్రధానే ఆ పని చేస్తారని స్పష్టంచేశారు. అక్టోబర్‌లో కన్జర్వేటివ్ పార్టీ కాన్ఫరెన్స్ మొదలయ్యేలోపు కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టేలా చూస్తామని ఆయన అన్నారు. ఈయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బ్రిటన్ సొంతంగా నిలదొక్కుకోగలదన్ననమ్మకం తనకుందని కామెరాన్ చెప్పారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







