ఇవి తింటే బాడీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది
- November 07, 2024
మానవ శరీరంలో గుండె అతి ముఖ్యమైన అవయవం. ఈ గుండెని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. బాడీలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపై ఎఫెక్ట్ పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవాలి. దీంతో గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీనికోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
మీ డైట్‌లో బీన్స్, చిక్కుళ్ళు, టోఫు వంటి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవడం కూడా మంచిది. దీని వల్ల ప్రోటీన్ బాడీకి అందుతుంది. ప్రోటీన్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మరీ ముఖ్యంగా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మంచిదని గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు సంతృప్త కొవ్వులని తగ్గించాలి. వీటి బదులు అవకాడో, నట్స్, ఆలివ్ ఆయిల్ హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి. ఇది మంచి కొలెస్ట్రాల్‌ని పెంచి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.
ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. దీని వల్ల బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనికోసం మీరు ఓట్స్, బార్లీ, పండ్లు, ఫైబర్ రిచ్ కూరగాయలు వంటివి తీసుకోవచ్చు. దీనివల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయని గుర్తుంచుకోండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను పుష్కలంగా తినడానికి ప్రయత్నించండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.చేపలు, అవిసెలు, వాల్‌నట్స్ వంటి ఒమేగా 3 ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిది. ఒమేగా 3 బాడీలో మంటని తగ్గించి గుండె పనితీరుని మెరుగ్గా చేస్తుంది. కాబట్టి, వీటిని మీరు రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చండి .
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బరువు మెంటెయిన్ చేయడం కూడా చాలా ముఖ్యం. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. వర్కౌట్ చేయాలి. మంచి లైఫ్‌స్టైల్ ఫాలో అయితే బరువుని మెంటెయిన్ చేయొచ్చు. మీ వయసు, ఎత్తుని బట్టి ఎంత బరువు ఉండాలో డాక్టర్‌ని కనుక్కుని ఆ బరువు మెంటెయిన్ చేస్తే చాలా మంచిది. రెగ్యులర్‌గా వర్కౌట్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వారానికి 150 నిమిషాల ఇంపాక్ట్ వర్కౌట్ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. కాబట్టి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి, కొలెస్ట్రాల్‌ని తగ్గించుకుని గుండెని కాపాడుకోవాలంటే రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ బెస్ట్.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!