పుష్ప 2 ట్రైలర్ అప్డేట్..
- November 09, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప సీక్వెల్గా సినిమా రూపుదిద్దుకుంటోంది.రష్మిక మందన్న కథనాయికగా నటిస్తోండగా పహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు.దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక విడుదల టైమ్ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ ను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ట్రైలర్ విడుదల తేదీని అతి త్వరలోనే చిత్ర బృందం ప్రకటించనుంది.ఇప్పటికే ట్రైలర్ కు సంబంధించిన ఎడిటింగ్, వర్క్ ఫినిష్ అయినట్లుగా చిత్ర బృందం తెలిపింది.దీంతో వెయిటింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ మూవీలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.కిస్సిక్ అంటూ ఈ పాట సాగనుంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో లీకైంది.ఇది వైరల్గా మారింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







