‘గేమ్ ఛేంజర్’ టీజర్ వచ్చేసింది..

- November 09, 2024 , by Maagulf
‘గేమ్ ఛేంజర్’ టీజర్ వచ్చేసింది..

దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఎప్పుడో మూడేళ్ల క్రితం ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్స్ కోసం, సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ, అంజలి, నవీన్ చంద్ర, శ్రీకాంత్, SJ సూర్య.. పలువురు స్టార్స్ నటిస్తున్నారు.

ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి పలు పోస్టర్స్, రెండు సాంగ్స్ రిలీజ్ చెయ్యగా అవి ట్రెండ్ అయ్యాయి. నిన్న గేమ్ ఛేంజర్ టీజర్ ప్రోమో అని చిన్న వీడియో రిలీజ్ చేసారు. దాంతో టీజర్ పై అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ చేసారు. మీరు కూడా గేమ్ ఛేంజర్ టీజర్ చూసేయండి.

బేసిక్ గా రామ్ అంత మంచోడు ఇంకోడు లేడు కానీ వాడికి కోపం వస్తే.. వాడంతా చెడ్డోడు ఇంకొకడు ఉండడు.. అనే డైలాగ్ తో మొదలైన టీజర్.. యాక్షన్ సీన్స్, సినిమాలోని అన్ని రకాల సీన్స్ కట్స్ తో అదిరిపోయే BGM తో పర్ఫెక్ట్ గా చూపించారు. చివర్లో చరణ్ ఐ యాం అన్ ప్రిడిక్టబుల్ అంటూ స్టైలిష్ గా డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. ఇక గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com