పాకిస్థాన్ లో భారీ బాంబు పేలుడు: 3 మృతి 32 మందికి గాయాలు
- June 24, 2016
పాకిస్తాన్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో శుక్రవారం బాగా రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ బాంబు పేలడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికిగా పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. క్వెట్టా సిటీలో రోడ్డు పక్కన పార్క్ చేసిన మోటార్ బైక్ లో అమర్చిన బాంబు ఒక్కసారిగా పేలడంతో రంజాన్ షాపింగ్ లో ఉన్న ప్రజలు పరుగులు తీశారు. రంజాన్ పండుగ సందర్భంగా ఈ ఏరియాలో షాపింగ్ సందడి నెలకొంటుంది.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, భద్రతా బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. దర్యాప్తును ప్రారంభించాయి. ఈ దాడికి బాధ్యులుగా ఎవరూ ప్రకటించకపోయినప్పటికీ, తాలిబన్లు, బలోచ్ మిలిటెంట్ల కదలికలు ఈ ఏరియాలో చురుగ్గా ఉంటాయి. దీంతో ఇది మిలిటెంట్ల పనే అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







