కబాలి పోస్టర్లతో విమానాలు..!!
- June 24, 2016రజనీ కాంత్.. ఏ ముహుర్తాన కబాలి సినిమా మొదలు పెట్టాడో కాని, రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసేస్తున్నాడు. ఆన్ లైన్ వ్యూస్, ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా రకరకాల రికార్డ్ లను కొల్లగొట్టిన సూపర్ స్టార్, తాజాగా మరో రికార్డ్ కు రెడీ అవుతున్నాడు. రెండు భారీ ఫ్లాప్ ల తరువాత రజనీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సినిమాను ఎలాగైన బ్లాక్ బస్టర్ సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.అందుకు తగ్గట్టుగా ప్రచారం విషయంలోనూ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చెన్నైలోని భారీ హోర్డింగ్ లతో పాటు బస్సులు, రైళ్లను కూడా కబాలి పోస్టర్లతో అలంకరించేస్తున్నారు. అది కూడా చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా విమానాలకే కబాలి పోస్టర్స్ వేస్తున్నారట. రెండు డొమాస్టిక్ ఫ్లైట్స్ తో పాటు, మరో రెండు ఇంటర్ నేషనల్ ఫ్లైట్స్ కు కబాలి పోస్టర్స్ వేస్తున్నారు. గతంలో హాలీవుడ్ సినిమా హాబిట్ కోసం ఈ తరహా ప్రచారం చేయగా, ఇండియాలో మాత్రం కబాలినే తొలిసారిగా ఈ రికార్డ్ సొంతం చేసుకోనుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







