ఎయిరిండియాలోకి మరో రూ.3,195 కోట్లు
- November 11, 2024
న్యూ ఢిల్లీ: టాటా గ్రూప్ కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో, సింగపూర్ ఎయిర్లైన్స్ గ్రూప్ విస్తారాను విలీనం చేయనున్న సంగతి తెలిసిందే.ఈ రెండు సంస్థల విలీన ప్రక్రియ 2022 నవంబర్ 29న స్టార్ట్ కాగా ఈ రోజు పూర్తి కానుంది.కాగా విలీనం తర్వాత సింగపూర్ ఎయిర్లైన్స్ కు ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటా ఉండనుంది.ఈ నేపథ్యంలో సింగపూర్ ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాలో రూ. 3,195 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించింది.కాగా విస్తారా 2015 జనవరి 9 నుంచి మన ఇండియాలో సేవలందిస్తోంది. అయితే విలీనం తర్వాత ఈ నెల 12 నుంచి ఎయిర్ ఇండియా-విస్తారా కలిసి ఒకటే విమానయాన సంస్థగా సేవలు అందించనుంది. ఎయిర్ ఇండియా అవసరాల దృష్ట్యా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెడుతామని సింగపూర్ ఎయిర్లైన్స్ తెలిపింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







