జూలై 2న ‘అత్తారిల్లు’ ఆడియో విడుదల!
- June 24, 2016
అంజన్ కళ్యాణ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అంజన్ కే కళ్యాణ్ స్వీయ దర్శకత్వం నిర్మిస్తున్న చిత్రం ‘అత్తారిల్లు’. అంతా కొత్త నటీనటులతో రూపొందిన ఈ హర్రర్ కామెడీ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేషమైన స్పందన లభిస్తోంది. జూలై 2న ఈ చిత్ర ఆడియో గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత అంజన్ కే కళ్యాణ్ మాట్లాడుతూ... ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు రెస్పాన్స్ బాగుంది. చాలా మంది పోన్ చేసి కాంప్లిమెంట్స్ ఇస్తుంటే మా టీమ్ అంతా ఎంతో ఉత్సాహంగా ఉంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారికి ఈ సినిమా నచ్చి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. కడుపుబ్బ నవ్వించే కామెడీ, భయపెట్టించే థ్రిల్స్ తో పాటు ఆడియన్స్ కి కావాల్సిన ఆల్ ఎలిమెంట్స్ మా చిత్రంలో ఉన్నాయి. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. డెన్నిస్ నార్టన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు జూలై 2న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం` అని తెలిపారు.
సాయి రవి కుమార్ , అతిథి దాస్, అనస్తేశియ చప్రసోవ, నండూరి రాము, రాకేశ్ శర్మ, ఉదయ్ శరత్, జోజూ, ఆర్‌జె వంశీ రామరాజు, ఎక్కాల వినోద్ కుమార్, రాజేంద్ర పులి, రాజశేఖర్, మమత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్: మణిశర్మ, పాటలు: డెన్నిస్ నార్టన్, కెమెరా: శివశంకర వరప్రసాద్, డాన్స్: జోజూ, ఫైట్స్: రెబల్ మాస్టర్, కో-డైరెక్టర్: కరణం వి లోకనాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యం.హెచ్.రెడ్డి, సమర్పణ: అక్షయ్-అశ్విన్, కో- ప్రొడ్యూసర్స్: కాకల్ల లక్ష్మీ మల్లయ్య, జ్యోతి. కె. కళ్యాణ్, కథ - స్క్రీన్‌ప్లే - నిర్మాత - దర్శకత్వం: అంజన్ కె కళ్యాణ్.



తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







