బలి దానం
- July 07, 2015
ఆవేదనతో కదులున్నది పుడమి తల్లి భూకంప రూపంలో
కన్న తల్లిని వాటాలుగా పంచుకు తినాలని యుద్దోన్మాదoతో
కొట్టుకు చస్తున్న తన బిడ్డల చూసి,
అనారోగ్యంతో విల విలలాడుతుంది అమ్మవారు,అంటువ్యాదుల రూపంలో
తన పాలు త్రాగుచు తన పైనే కాలుష్యాన్ని సృష్టిస్తున్న
మనిషి మనుగడకు నిరసనగా
రగులుతున్న వేడి నిట్టూర్పులు విడుస్తున్నది ప్రకృతి దేవత
వాతావరణ రూపంలో,అరాధించవలసిన వారే అంగాంగాలను
నరుకుతున్నందుకు తగిన శాస్తిగా..
భరింపరాని భాధతో కళ్ళు మూసుకు పరుగులు తీస్తున్నది
మృత్యువు దేవత, తన ఆవేశానికి అన్యం పుణ్యం ఎరుగని
అమాయక జీవులు బలి అవుతున్నందుకు..క్షమించి
ఈ బలి దానానికి సిద్దం కండని.
జయ రెడ్డి బోడ(అబుధాబి) తేది:07-07-2015
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







