జార్ఖండ్‌లో ఏకంగా రెండు లక్షల రేషన్ కార్డులను రద్దు..
- June 25, 2016
రెండు నెలల వ్యవధిలోనే జార్ఖండ్‌లో ఏకంగా రెండు లక్షల రేషన్ కార్డులను రద్దుచేశారు. గత మూడు సంవత్సరాలలో కేవలం 800ల రేషన్ కార్డులు రద్దు చేయగా ఈసారి అత్యధికంగా రెండు లక్షల కార్డులు రద్దు చేశారు. పౌరసరఫరాలు, వినియోగ వ్యవహారాల కార్యదర్శి వినయ్ కుమార్ చౌబే తెలిపిన వివరాల ప్రకారం.. చౌక ధరల దుకాణాల సంఖ్య కూడా 24,500 నుంచి 23,500లకు పడిపోయింది. ఇదంతా అవినీతి వ్యతిరేక చర్యలు, కంప్యూటర్ సేవల ద్వారా, ఆధార్ కార్డుల ద్వారానే సాధ్యపడిందని ఆయన అన్నారు.
త్వరలో రేషన్ పంపిణీ, సంబంధిత సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వినియోగదారులకు అందేలా చూస్తామన్నారు. దీనికి ఇప్పటికే 25 లక్షల వినియోగదారుల ఫోన్ నెంబర్లను ఆ శాఖ సేకరించిందని తెలిపారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం 86.48శాతం గ్రామీణ జనాభా, 60.20శాతం పట్టణ జనాభా దీని ద్వారా లబ్ధి పొందాల్సి ఉందన్నారు. లబ్ధిదారులకు 1,42,794.245 టన్నుల ఆహార ధాన్యాలు అవసరమవుతాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







