సోమాలియా నాసో హబ్లోద్ హోటల్‌పై ఉగ్రదాడి
- June 25, 2016
సోమాలియా రాజధాని మొగాదిషులోని నాసో హబ్లోద్ హోటల్‌పై ఉగ్రవాదులు తెగబడ్డారు. తొలుత హోటల్ బయట కారు బాంబు దాడి చేశారు. అనంతరం హోటల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భద్రతాబలగాలు హోటల్‌ను చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు, భద్రతాసిబ్బందికి మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
అయితే ఉగ్రదాడిలో ఎంతమంది మృతిచెందారన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు. అల్‌ఖైదాకు చెందిన అల్‌షబబ్ ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. హోటల్లో చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. హోటల్ నుంచి కాల్పులు, భారీ పేలుడు శబ్ధాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. మొగాదిషులోని పలు హోటళ్లపై గతంలోనూ ఉగ్రకాల్పులు జరిగిన ఘటనలున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







