'రాబిన్‌హుడ్' ఫస్ట్ సింగిల్ వన్ మోర్ టైం నవంబర్ 26న రిలీజ్
- November 25, 2024
హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఇటివలే రిలీజ్ చేసిన అడ్వెంచర్ అండ్ హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజీ హై-బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
మేకర్స్ 'రాబిన్‌హుడ్' మ్యూజికల్ ప్రమోషన్స్ ని ప్రారభించబోతున్నారు. ఫస్ట్ సింగిల్ వన్ మోర్ టైం సాంగ్ ని నవంబర్ 26న రిలీజ్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ లో నితిన్, శ్రీలీల వైబ్రెంట్ అండ్ స్టయిలీస్ లుక్ లో కనిపించారు. పోస్టర్ లో డైనమిక్ డ్యాన్స్ మూమెంట్ వెరీ ఎట్రాక్టివ్ గా వుంది.
ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ డీవోపీ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.
ఎంటర్ టైనింగ్ అడ్వంచర్ 'రాబిన్‌హుడ్' క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది.
నటీనటులు: నితిన్, శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సిఈవో: చెర్రీ
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: సాయి శ్రీరామ్
ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!







