యూనియన్ ఫోర్ట్రెస్ 10 మిలిటరీ పరేడ్..నివాసితులు ఆహ్వానం..!!

- November 25, 2024 , by Maagulf
యూనియన్ ఫోర్ట్రెస్ 10 మిలిటరీ పరేడ్..నివాసితులు ఆహ్వానం..!!

యూఏఈ: అల్ ఐన్ లో డిసెంబరు 14న 'యూనియన్ ఫోర్ట్రెస్ 10' మిలిటరీ పరేడ్ ను నిర్వహించనుంది. యూఏఈ సాయుధ దళాలు ఇందులో పాల్గొని తమ సైనిక విన్యాసాలను ప్రదర్శించనున్నారు.  కమ్యూనిటీ సభ్యులు ఈవెంట్‌కు హాజరు కావాలని యూఏఈ సాయుధ దళాలు ఆహ్వానం పలుకుతున్నాయి. అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 'యూనియన్ ఫోర్ట్రెస్ 10' పరేడ్ ను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమంలో సాయుధ దళాల వివిధ యూనిట్ల సంయుక్త సైనిక కవాతుతో సహా అనేక కార్యకలాపాలు ఉంటాయి. సాయుధ దళాల సంసిద్ధతను ప్రదర్శిస్తాయి. అధునాతన పోరాట సామర్థ్యాలను హైలైట్ చేసే ఫీల్డ్ పోరాటాలు ఉంటాయి.

6 సంవత్సరాల తర్వాత అల్ ఐన్‌లో
మార్చి 2017లో అబుదాబి కార్నిష్ లో ప్రారంభించినప్పటి నుండి 'యూనియన్ ఫోర్ట్రెస్' మిలిటరీ పరేడ్ మంచి గుర్తింపు పొందింది. నవంబర్ 2017లో షార్జాలోని 'యూనియన్ ఫోర్ట్రెస్ 2', ఫిబ్రవరి 2018లో అల్ ఐన్‌లో 'యూనియన్ ఫోర్ట్రెస్ 3', నవంబర్ 2018లో ఫుజైరాలో 'యూనియన్ ఫోర్ట్రెస్ 4', 'యూనియన్ ఫోర్ట్రెస్ 5'తో సహా వివిధ ఎమిరేట్‌లలో నిర్వహించారు. మార్చి 2019లో అజ్మాన్, నవంబర్ 2019లో రస్ అల్ ఖైమాలో 'యూనియన్ ఫోర్ట్రెస్ 6', ఉమ్ అల్ క్వైన్‌లో 'యూనియన్ ఫోర్ట్రెస్ 7' ఫిబ్రవరి 2020 నిర్వహించారు. 'యూనియన్ ఫోర్ట్రెస్ 8' మార్చి 2022లో ఎక్స్‌పో 2020 దుబాయ్‌లో జరిగింది. నవంబర్ 2023లో అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో 'యూనియన్ ఫోర్ట్రెస్ 9' జరిగింది. ఇప్పుడు 10వ ఎడిషన్ కోసం డిసెంబర్ 14న అల్ ఐన్‌కి తిరిగి వచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com