మాటిమాటికీ అనారోగ్యం పాలవుతున్నారా .. ఈ ఫుడ్స్ తినండి
- November 28, 2024
మన ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారం పోషకాహారమై ఉండాలి. ఈ ఫుడ్ వల్ల మన బాడీకి పోషణ, బలం అందుతుంది. శక్తి కూడా పెరుగుతుంది. ప్రజెంట్ ఎక్కడ చూసినా పొల్యూషన్, కెమికల్స్‌తో కూడిన ఫుడ్స్ మాత్రమే ఉంటున్నాయి. వీటి ఎఫెక్ట్ ఫుడ్‌కి కూడా ఉంటుంది. ఆ ఫుడ్స్‌ని తిన్నప్పుడు మన బాడీలో టాక్సిన్స్ పెరుగుతాయి. దీంతో ఆరోగ్య సమస్యలొస్తాయి.
టాక్సిన్స్‌లో రెండు రకాల టాక్సిన్స్ ఉంటాయి. ఒకటి ఆహారం జీర్ణమైన తర్వాత ఏర్పడే సహజమైనవి అయితే, మరికొన్ని రసాయనాలు, ఎరువుల ద్వారా పండే పంటలతో వచ్చే కృత్రిమమైన టాక్సిన్స్. ఈ టాక్సిన్స కారణంగా మన బాడీలో చాలా సమస్యలో వస్తాయి. అందుకోసం డైట్‌లో కొన్ని కూరగాయల్ని యాడ్ చేసుకోవాలి. దీంతో బాడీలోని టాక్సిన్స్‌ని బయటికి వెళ్ళిపోతాయి.
1. పండ్లలో కూడా సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీస్, పుచ్చకాయలు తినడం మంచిది. వీటిలో నీటిశాతం ఎంత ఎక్కువగా ఉంటుంది. విటమిన్స్ కూడా అంతే విధంగా అందుతాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల బాడీలోని టాక్సిన్స్ దూరమై ఆరోగ్యానికి చాలా మంచిది.
2. తాజా కూరగాయలు, ముఖ్యంగా బ్రకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రసెల్స్ స్ప్రౌట్స్‌లో సల్ఫర్ కలిగిన సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బాడీలోని టాక్సిన్స్ దూరమవుతాయి. దీంతో పాటు జీర్ణ సమస్యలు, ఇతర సమస్యలు కూడా దూరమవుతాయి.
3. పసుపులోని గుణాలు తెలుసు కాబట్టే తరతరాలుగా మన పూర్వీకులు పసుపుని ఎక్కువగా వాడతారు. దీనిని వంటల్లోనే కాదు ఆయుర్వేద మందుల తయారీల్లోనూ వాడతారు. పసుపుని వాడడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇమ్యూనిటీని పెంచి అనారోగ్యాలను దూరం చేస్తాయి. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
4. నట్స్, గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ అన్నీ బయటికి వచ్చేస్తాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల మన అవయవాలు కూడా చక్కగా ఉంటాయి. ఇందులో బెర్రీస్, బెల్ పెప్పర్స్, సిట్రస్ ఫ్రూట్స్, బ్రకోలీ, చిక్కుళ్ళు, గ్రీన్‌టీలు ఉన్నాయి.
5. ఉల్లి, వెల్లుల్లి మనం కూరగాయల్లో ఎక్కువగా వాడతం ఇందులోని సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల డీటాక్స్ జరుగుతుంది. వీటిని మనం పచ్చిగా అయినా తినొచ్చు. కూరల్లో వేసి అయినా తినొచ్చు.
6. పులియబెట్టిన ఫుడ్స్‌లో హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది. వీటిని మీరు మీ డైట్‌లో యాడ్ చేయడం వల్ల ప్రేగుల్లోని హానికరమైన బ్యాక్టీరియా కూడా దూరమవుతుంది. వీటితో పాటు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. అదే విధంగా, నీరు ఎక్కువగా తాగాలి. అదే విధంగా, నెయ్యి, వెన్న, తేనె, ఎండు అల్లం, నల్ల మిరియాలు, రాళ్ళ ఉప్పుని కూడా మన డైట్‌లో యాడ్ చేస్తే బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ని దూరం చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







