75 ఏళ్ల నుండి నేటికీ ఆ రైలులో ఫ్రీ జర్నీ తెలుసా..?
- November 28, 2024భారతదేశ రైల్వే చరిత్ర అనేది ఒక విశేషమైన ప్రయాణం. 1853లో ప్రారంభమైన తొలి రైల్వే ప్రయాణం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రైల్ నెట్వర్క్‌ను కలిగి ఉంది. ముంబై నుండి థానే వరకు నడిచిన మొదటి రైలు ద్వారా తొలి రైల్వే ప్రయాణం మొదలైంది. అప్పటి నుండి భారతదేశ రైల్వేలు అనేక మార్పులు, అభివృద్ధులను చూసాయి. ప్రతిరోజూ పదిహేను వేల కంటే ఎక్కువ రైళ్లు సుమారు 25 మిలియన్ల ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్న భారతీయ రైల్వేలు 115,000 కిలోమీటర్ల పొడవుతో, తక్కువ ధరలకే ప్రయాణీకులకు సేవలందించే ప్రజారవాణా వ్యవస్థగా పేరుగాంచాయి.
ఇంత గొప్ప చరిత్ర కలిగిన రైల్వే వ్యవస్థ మన దేశంలో గత 75 ఏళ్లుగా ప్రయాణికులకు ఉచిత సేవలు అందిస్తున్న రైలు ఒకటి ఉందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రైలులో ప్రయాణించడానికి టికెట్ కొనాల్సిన అవసరం లేదు. ఆ రైలులో టీసీ ఉండరు. ఈ రైలులో ప్రయాణించాలనుకునే వారు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ రైలు పేరే భాక్ర_నంగల్ రైలు. ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సేవలన్నీ ఉచితమే. అసలు ఈ రైలులో ప్రయాణం ఎందుకు ఉచితం ? ఇది ఎక్కడినుండి ఎక్కడికి ఎంతదూరం ప్రయాణిస్తుంది ? రైలు యొక్క ప్రత్యేకతల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
రైల్వేలు ప్రారంభంలో ప్రధానంగా బ్రిటిష్ పాలకుల అవసరాలను తీర్చడానికి ఉపయోగించారు. కానీ, కాలక్రమేణా అవి భారతీయుల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశ రైల్వేలు మరింత విస్తరించాయి. ఆ తరువాత 1951లో అన్ని ప్రైవేటు రైల్వే సంస్థలను ఒకటిగా కలిపి భారతీయ రైల్వేలు ఏర్పడింది. ఈ టైమ్ లో ఈ రైలు మార్గం భాక్రా-నంగల్ ఆనకట్ట నిర్మాణం కోసం పెద్ద యంత్రాలు, ఇనుము, రాళ్ళు మరియు ఇతర సామగ్రిని రవాణా చేయడానికి ఉపయోగించేవారు.
అదే సమయంలో యంత్రాలను సామాగ్రిని తరలించడానికి పెద్ద ఎత్తున ప్రజలు అవసర ఉండేది. కావున యంత్రాల సామాగ్రిని ఎగుమతి దిగుమతి చేయడానికి ప్రజలను ఉచితంగా రవాణా చేసేవారు.
ఆనకట్ట నిర్మాణం పూర్తయ్యాక ఈ రైలు ఇక్కడి స్థానిక గ్రామాలను కలుపుతూ కొనసాగింది. అయితే ఆనకట్ట నిర్మాణానికి గుర్తుగా అదే సంప్రదాయాన్ని గౌరవిస్తూ దాన్ని ఉచితంగా ఉంచాలని నిర్ణయించారు. అప్పటి నుండి అంటే 1948 నుండి నేటికీ ఈ రైలు క్రమం తప్పకుండా నడుస్తోంది. ప్రస్తుతం ప్రతిరోజూ 1000 మందికి పైగా ఈ రైలును వినియోగిస్తున్నారు. ఈ రైలు కేవలం రవాణా సాధనం మాత్రమే కాదు, చరిత్ర మరియు సంప్రదాయం యొక్క సజీవ భాగం. టికెట్ లేని కారణంగా ఈ రైలులో టిటిఒ ఉండరు. ఈ రైలులో బ్రిటీష్ కాలం నాటి కలపతో తయారు చేసిన కుర్చీలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.
ఈ రైలులో టికెట్లు లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీని నిర్వహణ భాక్రా-బియాస్ మేనేజ్మెంట్ బోర్డు (బీబీఎంబీ) నిర్వహిస్తుంది. గంటకు 18 నుంచి 20 గ్యాలన్ల ఇంధనాన్ని వినియోగించే ఈ రైలుకు టికెట్లు తీసుకోవాలని తొలుత బీబీఎంబీ భావించింది. కానీ ఈ రైలు సంప్రదాయాన్ని గౌరవిస్తూ దాన్ని ఫ్రీగా ఉంచాలని నిర్ణయించారు.
ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 7:05 గంటలకు నంగల్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి రాత్రి 8:20 గంటలకు భాక్రా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నంగల్ నుంచి మధ్యాహ్నం 3.05 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.20 గంటలకు భాక్రా రైల్వేస్టేషన్ కు చేరుకుంటుంది. 13 కిలోమీటర్ల దూరం ప్రయానించే ఈ రైలు మొత్తం ప్రయాణంలో ఐదు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.
పర్యాటకులు భారతదేశం యొక్క ఎత్తైన ఆనకట్టలలో ఒకటైన భాక్రా-నంగల్ ఆనకట్టతో పాటు అందమైన సత్లాజ్ నది, శివాలిక్ పర్వతాల మీదుగా సాగే ప్రయాణంలో అందమైన ప్రకృతి దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ రైలును బాలీవుడ్ సినిమాలో కూడా చూపించారు. సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా నటించిన ‘చల్తా పుర్జా’ సినిమాలో ఈ రైలు సన్నివేశం ఉంది. దీంతో ఇక్కడి ప్రదేశాలను వీక్షించడానికి సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
60 ఏళ్ల నాటి ఇంజిన్‌తో నడిచే భాక్రా-నంగల్ రైలు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన రైలుగా పేరొందింది. 1953లో అమెరికా నుంచి ఈ రైలు డీజిల్ ఇంజన్లను దిగుమతి చేసుకున్నారు. ఈ రైలు బోగీల ప్రత్యేకత ఏమిటంటే అవి కరాచీలో తయారు చేశారు. అంతేకాకుండా, కుర్చీలు కూడా బ్రిటీష్ కాలం నాటి కలపతో తయారు చేశారు. నేటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి.
భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. 65,000 కిలోమీటర్ల రూట్‌లను కలిగి 7,500 స్టేషన్లతో ప్రతి రోజు సుమారు 23 మిలియన్ల మంది ప్రయాణీకులు భారతీయ రైల్వేలను ఉపయోగిస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థలలో ఒకటి.
భారతీయ రైల్వేలు అనేక విభాగాలుగా విభజించబడ్డాయి, ప్రతి విభాగం ఒక ప్రత్యేక ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. ఈ విభాగాలు రైల్వే నిర్వహణను సులభతరం చేస్తాయి మరియు ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందిస్తాయి. రైల్వేలు సాంకేతికతలో కూడా ముందంజలో ఉన్నాయి. రిజర్వేషన్ సిస్టమ్ కంప్యూటరీకరణ, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
భారతీయ రైల్వేలు పర్యాటక రంగంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటెన్ రైల్వే వంటి పర్యాటక రైళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇవి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి.
మొత్తానికి, భారతీయ రైల్వేలు భారతదేశ అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషించాయి. ఇవి కేవలం రవాణా సాధనాలు కాకుండా, భారతీయుల జీవితంలో ఒక భాగంగా మారాయి. ఈ చరిత్రను తెలుసుకోవడం ద్వారా మనం భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని అర్థం చేసుకోవచ్చు.
- వేణు పెరుమాళ్ల
తాజా వార్తలు
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!