షేక్ జాయెద్ రోడ్డులో ఢీకొన్న పలు కార్లు..!!
- December 15, 2024
దుబాయ్: షేక్ జాయెద్ రోడ్‌లో ఆదివారం తెల్లవారుజామున పలు కార్లు ఢీకొన్న కారణంగా టెయిల్‌బ్యాక్‌లు చోటుచేసుకున్నాయి. ఒక ప్రత్యక్ష సాక్షి సంఘటనను వివరించాడు. అనేక రికవరీ, పోలీసు వాహనాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని చెప్పారు. అబుదాబి వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఎమిరేట్స్ గ్రాండ్ హోటల్, AA టవర్ భవనాలకు సమాంతరంగా నడుస్తున్న రహదారిపై ఈ సంఘటన జరిగింది. శబ్ధం వినిపించిందని, కానీ మొదట్లో అది ఏమిటో గుర్తించలేకపోయానని.. అది పలు కార్ల మధ్య జరిగిన ప్రమాదం అని తాను తర్వాత గుర్తించినట్టు చెప్పారు. ప్రమాదానికి గురైన వాహనాల్లో తెల్లటి సెడాన్ కారు, రేంజ్ రోవర్, ట్యాక్సీ ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, వాహనాల వెలుపలి, ముందు భాగం దెబ్బతింది. వాటి కొన్ని టైర్లు పాడయ్యాయి.. అధికారులు రోడ్డును క్లియర్ చేసే పనిలో ఉన్నందున వాహనాలు వెళ్లేందుకు ఒక లేన్ మాత్రమే తెరిచి ఉంచారు. దుబాయ్ పోలీసులు ఆదివారం ఈ సంఘటనపై వాహనదారులకు అలెర్ట్ జారీ చేశారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







