ఇవి రోజువారీ తీసుకుంటే బరువు తగ్గుతారు
- December 16, 2024
బరువుని పెంచడం, తగ్గించడంలో మనం తీసుకునే ఫుడ్ కీ రోల్ పోషిస్తుంది. మనం ఎంచుకునే ఫుడ్స్‌ని బట్టే బరువు పెరగడం, తగ్గడం జరుగుతుంది.అందుకే, బరువు తగ్గాలనుకునే వారో లో కేలరీ ఫుడ్స్ తీసుకోవాలి.వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. పైగా బరువు కూడా తగ్గుతారు. అలాంటి ఫుడ్స్ ఏముంటాయనుకోవద్దు. చాలా ఉంటాయండి.. అలాంటి వాటన్నింటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాం.వీటిని తినడం వల్ల మీ కడుపు నిండుగా ఉంటుంది. బరువు కూడా తగ్గుతారు.
బరువు తగ్గాలనుకునేవారు కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు. తీసుకునే ఫుడ్స్ సరైనవి తీసుకోవాలి. దీంతో హ్యాపీగా తింటూనే బరువుని తగ్గించుకోవచ్చు. మరి అలాంటి ఫుడ్స్ ఏమున్నాయో తెలుసుకోండి.
1.చికెన్ బ్రెస్ట్ గ్రిల్ చేసి స్లైస్ చేయండి. దానిపై తాజా పాలకూర, చెర్రీ టమాటాలు, బాదం పలుకులు వంటివి వేయండి. దీంతో కడుపు నిండుగా ఉంటుంది. హ్యాపీగా బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుంది.
2. సలాడ్స్ చాలా హెల్దీ. వీటిని క్వినోవా, శనగల వంటి వాటితో వీలైనంతగా చెర్రీ టమాట, దోసకాయలు, ఉల్లిపాయలు, పార్స్లీ, పుదీనా వంటి కూరగాయల్ని యాడ్ చేసుకుని తినండి. బరువు తగ్గొచ్చ. వీటిని మరింతగా రిఫ్రెష్ చేసేందుకు నిమ్మరసం చల్లి తీసుకోవచ్చు.
3. మిక్స్డ్ బెర్రీస్, గ్రీక్ యోగర్ట్, ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్, తేనె కలిపిన క్రీమ్ వేసుకుని బ్రేక్‌ఫాస్ట్‌లా అయినా స్నాక్‌లా అయినా తీసుకోండి. అదే విధంగా, స్మూతీస్‌లో మీరు అవకాడో కలపొచ్చు. వీటి వల్ల కూడా చాలా ఫిల్లింగ్‌లా ఉంటుంది. బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుంది.
4. కాలే ఆకులు, పైనాపిల్ ముక్కలు, అరటిపండు, కొబ్బరినీటిని కలిపి స్మూతీ చేయండి. దీనిని తాగడం వల్ల రిఫ్రెష్‌గా, ఫిల్లింగ్‌గా ఉంటుంది.
5. మిక్స్డ్ బెర్రీస్, గ్రీక్ యోగర్ట్, ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్, తేనె కలిపిన క్రీమ్ వేసుకుని బ్రేక్‌ఫాస్ట్‌లా అయినా స్నాక్‌లా అయినా తీసుకోండి. అదే విధంగా, స్మూతీస్‌లో మీరు అవకాడో కలపొచ్చు. వీటి వల్ల కూడా చాలా ఫిల్లింగ్‌లా ఉంటుంది. బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుంది.
6. ఉడికించిన శనగల్ని ఆలివ్ ఆయిల్‌తో టాస్ చేయండి. దీనిలో మీకు ఇష్టమైన జీలకర్ర, మిర్చి, మసాలా పొడులు యాడ్ చేసుకోవచ్చు. వీటిని మీరు ఉడికించకుండా వేయించుకోవచ్చు. దీంతో మంచి స్నాక్ ఐటెమ్‌ని ఎంజాయ్ చేయొచ్చు.
7. కోడిగుడ్లలో ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే మేలు జరుగుతుంది. వీటిని తింటే ఎక్కువసేపటి వరకూ కడుపు నిండుగానే ఉంటుంది.దీంతో కూడా బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుంది. బరువు కంట్రోల్ అవుతుంది.
8. యాపిల్‌లో ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఆల్మండ్ బటర్‌లో ప్రోటీన్ ఉంటుంది. దీని వల్ల మంచి హెల్దీ ఫిల్లింగ్ స్నాక్ ఐటెమ్ అవుతుంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







