అజ్మాన్‌లో ‘ఫోన్ స్కామ్’..15 మంది ముఠా అరెస్ట్..!!
- December 29, 2024
యూఏఈ: అజ్మాన్‌లో "ఫోన్ స్కామ్" కేసులో 15 మంది వ్యక్తుల ముఠాను అరెస్టు చేసినట్లు అజ్మాన్ పోలీసులు తెలిపారు. ఆసియా జాతీయుల ముఠా ఇతరులను ట్రాప్ చేస్తుందని, తద్వారా వారి బ్యాంకు వివరాలు లేదా వారి ID వంటి అధికారిక పత్రాలను అప్డేట్ చేయమని కోరుతూ, అధికారుల వలే నటిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.
నకిలీ డేటా, డాక్యుమెంట్లతో నమోదైన ఫోన్ కార్డుల నుంచి వచ్చిన కాల్స్‌పై ఫిర్యాదులు అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దర్యాప్తు అనంతరం మోసానికి పాల్పడుతున్న ముఠాను గుర్తించి, వారి వద్ద నుండి 19 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అజ్మాన్ పోలీస్‌లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ సయీద్ అల్ నుయిమి తెలిపారు. ఇలాంటి కాల్‌లను నమ్మవద్దని, వాటిని నివేదించడానికి వెనుకాడవద్దని అల్ నుయిమీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఫోన్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేయమని బ్యాంకులు అడగవని తెలిపారు. బ్యాంకు ఖాతాదారులు ఈ ఫేక్ కాల్స్ , మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కస్టమర్ సర్వీస్ ఏజెంట్ల ద్వారా మాత్రమే డేటాను అప్డేట్ చేయాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







