గాలికి మెటల్ షీట్లు పడి వాహనం ధ్వంసం.. BD4,814 పరిహారం..!!

- December 29, 2024 , by Maagulf
గాలికి మెటల్ షీట్లు పడి వాహనం ధ్వంసం.. BD4,814 పరిహారం..!!

మనామా: తుఫాను సమయంలో చేలరేగిన గాలుల తీవ్రతకు ఇనుప షీట్లు పడిపోవడం వల్ల వాహనం దెబ్బతిన్నందుకు GCC పౌరుడికి BD4,814 పరిహారం చెల్లించాలని హై సివిల్ కోర్టు ఒక బీమా కంపెనీని ఆదేశించింది. ఈ ఏడాది మార్చిలో అతను హూరా హోటల్ ముందు వాహనం ఆపి ఉండగా ఈ ఘటన జరిగింది. తన క్లయింట్ తన కారును హోటల్‌లోని నిర్దేశిత పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసినట్లు అతడి తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ఆ రోజు రాత్రి బలమైన గాలుల సమయంలో  హోటల్ నుండి మెటల్ షీట్లు పడిపోయాయని, దీని వలన వాహనానికి BD30,000 నష్టం జరిగిందని చెప్పారు.  తుది తీర్పులో బీడీ4,814 పరిహారం చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com