ఇది తింటే లంగ్ క్యాన్సర్ రాదా ... నిజాలివే !
- January 04, 2025
లంగ్ క్యాన్సర్ అనేది ఎవరికైనా వస్తుంది. ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉంటాయి. పొగతాగేవారికి ఈ సమస్య వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి చాలా ప్రమాదకరం. దీనికి ట్రీట్‌మెంట్ కూడా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇందులో మందులు, కీమోథెరపీలు కూడా ఉన్నాయి. కానీ, కొంతమంది దీనిని నయం చేసేందుకు ఇంటి చిట్కాలు ఉన్నాయని చెబుతుంటారు.
పొగతాగేవారు పచ్చిమిర్చి తినాలని పోస్ట్లో చెబుతున్నారు. దీని వల్ల లంగ్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. రోజూ పచ్చిమిరపకాయలు తింటే క్యాన్సర్ తగ్గుతుందని.. పొగతాగేవారు వీటిని తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. క్లెయిమ్‌లో నిజమెంతో తెలుసుకోవడానికి న్యూ ఢిల్లీలోని PSRI హెమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఉపాధ్యాయ్‌తో ఫ్యాక్ట్ చెక్ టీమ్ మాట్లాడగా.. ఆయన చెప్పిందేంటంటే.. పచ్చిమిర్చి తింటే లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుందనేది పూర్తిగా అబద్ధం. స్మోకర్లకి లంగ్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ఒకే ఒక్క మార్గమేదైనా ఉందంటే.. అది పొగ తాగకుండా ఉండడమేనని ఆయన చెప్పారు.
పచ్చి మిరపకాయల్లో ఓ సమ్మేళనం ఉంటుంది. దీనిని క్యాప్సైసిన్ అని అంటారు. కొన్ని అధ్యయనాల ప్రకారం, క్యాప్సైసిన్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి లంగ్ క్యాన్సర్‌ని చాలా వరకూ తగ్గిస్తాయి. కానీ, ఇది నిజమేనని అధ్యయనాలు నిరూపించలేదు. క్యాప్సైసిన్ లంగ్ క్యాన్సర్‌ని తగ్గించేందుకు సాయపడుతుందని ఎక్కడా నిరూపించబడలేదు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ని తగ్గించడంలో ముఖ్య విషయం స్మోకింగ్‌ని ఆపేయడమే. పచ్చిమిర్చి తిన్నా, తినకపోయినా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి ఎలాంటి తేడా ఉండదు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్మోకింగ్ మానేయడం ద్వారా మాత్రమే లంగ్ క్యాన్సర్‌ని తగ్గించుకోవచ్చు. పచ్చిమిర్చి తినడం దీనికి పరిష్కారం కాదు. ఇలాంటి పోస్టులని నమ్మి ఎవరూ మోసపోవద్దు. ఏదైనా విషయాలని పాటించే ముందు డాక్టర్‌ని సంప్రదించడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







