NIFT ఫ్యాషన్ ఎడ్యుకేషన్..NRIలకు ఆహ్వానం..!!
- January 04, 2025
మనామా: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) ఫ్యాషన్ ఎడ్యుకేషన్ లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో చేరేందుకు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIలు) కోసం ప్రత్యేక అవకాశాలను ప్రకటించింది. భారతదేశంలో 19 క్యాంపస్‌లతో NIFT డిజైన్, ఫ్యాషన్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీలో విభిన్న కోర్సులను అందిస్తుంది. ప్రతి NIFT క్యాంపస్‌లోని ఒక్కో కోర్సులో NRI విద్యార్థులకు మూడు సీట్లు ఉంటాయి.
అందుబాటులో ఉన్న ప్రోగ్రామ్‌లు:
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (4 సంవత్సరాలు) టెక్స్టైల్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, నిట్వేర్ డిజైన్లలో స్పెషలైజేషన్లు.
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (4 సంవత్సరాలు)
ఫ్యాషన్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు (2 సంవత్సరాలు).
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 6. ప్రవేశ పరీక్షలు ఫిబ్రవరిలో జరుగనున్నాయి.
మరింత సమాచారం కోసం NRI విద్యార్థులు క్యాంపస్‌ని +91-9995876421 లేదా +91-7012596156 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







