బీచ్‌లలో' తాబేళ్లు కనిపిస్తున్నాయా? ఏం చేయాలో తెలుసా?
- January 24, 2025
దుబాయ్: గత కొన్ని రోజులుగా అధిక గాలులు, చలి ఉష్ణోగ్రతల కారణంగా దుబాయ్ బీచ్‌లలో పెద్ద సంఖ్యలో సముద్ర తాబేళ్లు కొట్టుకువస్తున్నాయి. ఈ సందర్భంగా వాటి సహాయం కోసం కాల్ చేయాలని జుమేరా దుబాయ్ తాబేలు పునరావాస ప్రాజెక్ట్ (DTRP) సోషల్ మీడియాలో పోస్టులో కోరింది. బీచ్‌కి వెళ్లేవారు తాబేళ్లను గుర్తిస్తే వారి రెస్క్యూ హాట్‌లైన్ నెంబర్ కు తెలియజేయమని కోరింది.
సముద్ర తాబేళ్లు అనేవి ఇతర సరీసృపాలు వంటివి. వాటి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించలేవు. శీతాకాలంలో నీరు చల్లగా ఉన్నప్పుడు, అవి తక్కువ చురుకుగా ఉంటాయి. చిన్న తాబేళ్లు అనారోగ్యానికి గురవుతాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, అవి ఒడ్డుకు వెళ్లి బీచ్‌లో చిక్కుకుపోతాయి అని పేర్కొంది.
2004లో ప్రారంభించినప్పటి నుండి DTRP వేలకొద్దీ తాబేళ్లను సేవ్ చేసింది. అవి కోలుకున్నాక తిరిగి సముద్రంలోకి విడుదల చేసింది. టోల్-ఫ్రీ హాట్‌లైన్ 800 887853 కు కాల్ చేయమని కోరింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







