NATS ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

- January 25, 2025 , by Maagulf
NATS ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

అమెరికా: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా నార్త్ కరోలినా రాష్ట్రం లోని కారీలో సాయి మందిరంతో పాటు షార్లెట్లోని శ్రీ సాయి గురుదేవ్ దత్త మందిరంలో రంగోలీ పోటీలు జనవరి 19 ఆదివారం నాడు ఘనంగా జరిగాయి.సంక్రాంతి సంబరాల్లో భాగంగా నాట్స్ కాన్సస్ విభాగం ఈ రంగోలి పోటీలను నిర్వహించింది.నార్త్ కరోలినా లోని తెలుగు మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ రంగోలి పోటీల్లో పాల్గొన్నారు. తమ సృజనాత్మకతను ప్రదర్శించి..తెలుగు సంప్రదాయలను ప్రతిబింబించే ఎన్నో ముగ్గులు వేశారు.ఈ ముగ్గుల పోటీల్లో అత్యుత్తమంగా ఉన్న నాలుగింటిని ఎంపిక చేసి.. వాటిని వేసిన మహిళలకు నాట్స్ బహుమతులు పంపిణి చేసింది.నాట్స్ కాన్సస్ మహిళా నాయకత్వం ఈ రంగోలి పోటీలను దిగ్విజయంగా నిర్వహించింది.ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నాట్స్ అభినందించింది.రంగోలి పోటీలను చక్కగా నిర్వహించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com