తండేల్ ట్రైలర్ జనవరి 28న రిలీజ్
- January 25, 2025
యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వం వహించిన 'తండేల్' 2025లో రిలీజ్ కానున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటి, ఇప్పటివరకు విడుదలైన అన్ని పాటలకు బ్లాక్ బస్టర్ స్పందన లభించింది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన బుజ్జి తల్లి, శివ శక్తి, హిలెస్సో హిలెస్సో పాటలు మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో, యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.ఈరోజు, మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 28న విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు.
ట్రైలర్ పోస్టర్‌లో, అల్యూమినియం బకెట్ ని వెపన్ గా పట్టుకొని నాగ చైతన్య, విలన్స్ చంపడానికి సిద్ధంగా ఉన్న ఫెరోషిషియస్ అవతారంలో కనిపించారు. బకెట్‌పై రక్తపు గుర్తులను కూడా మనం గమనించవచ్చు, ఇది సినిమాలో ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్ నుంచి ప్రజెంట్ చేస్తోంది. లవ్ ఎలిమెంట్స్ తో పాటు, సినిమాలో మంచి యాక్షన్ కూడా ఉంటుందని కూడా ఇది సూచిస్తుంది.
అల్లు అరవింద్ సమర్పకుడిగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు.నేషనల్ అవార్డ్ విన్నర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు, శ్యామ్‌దత్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా, శ్రీనాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డిఓపీ: శ్యామ్‌దత్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్‌షో
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







