సౌదీ చరిత్ర పరిరక్షణ..రియాద్‌లో 'నేషనల్ హిస్టరీ ల్యాబ్' ప్రారంభం..!!
- January 27, 2025
రియాద్: రియాద్‌లోని ప్రిన్సెస్ నౌరా బింట్ అబ్దుల్రహ్మాన్ విశ్వవిద్యాలయం కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ సెంటర్లో “నేషనల్ హిస్టరీ ల్యాబ్” కార్యకలాపాలను కింగ్ అబ్దుల్ అజీజ్ ఫౌండేషన్ (దారా) సీఈఓ టర్కీ అల్-షువైర్ ప్రారంభించారు. 30 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు , 15 జాతీయ అంతర్జాతీయ సంస్థలు ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నాయి. ఇది జనవరి 28వరకు జరుగనుంది. సౌదీ అరేబియా విజన్ 2030కి అనుగుణంగా ఆధునిక పద్ధతులను ఉపయోగించి జాతీయ చరిత్రను సంరక్షించడం, డాక్యుమెంట్ చేయడం, ప్రచురించడంలో సృజనాత్మకతను ప్రోత్సహించడం ఈ ల్యాబ్ లక్ష్యం. "నేషనల్ హిస్టరీ ల్యాబ్" సౌదీ అరేబియా సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడం, దానిని భవిష్యత్ తరాలకు అందించడం కోసం అనేక వినూత్న ఆధునాతనమైన పరిష్కారాలను రూపొందించేందుకు కృషి చేస్తోంది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







