మహిళా పోలీసు అధికారిపై దాడి..6 నెలల జైలు శిక్ష..బహిష్కరణ వేటు..!!
- January 27, 2025
యూఏఈ: దుబాయ్‌లో మహిళా పోలీసు అధికారిపై దాడి చేసి అసభ్యపదజాలంతో దుర్భాషలాడిన కేసులో దోషిగా తేలిన జర్మనీ మహిళకు ఆరు నెలల జైలుశిక్ష, బహిష్కరణ విధించాలని కోర్టు ఆదేశించింది. ఈ సంఘటన ఏప్రిల్ 15, 2024 న బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ నేర పరిశోధన కార్యాలయంలో జరిగింది. అక్కడ 43 ఏళ్ల మహిళ దొంగతనం గురించి నివేదించడానికి వెళ్ళింది. రెండవ లెఫ్టినెంట్ అధికారితో ఆమె మాట్లాడుతున్న సమయంలో, ఆ మహిళ రెచ్చిపోయి అనుచితమైన పదజాలం ఉపయోగించడం ప్రారంభించింది. ఈ క్రమంలో అధికారిపై దాడికి పాల్పడింది. గతంలో తాము దాఖలు చేసిన నివేదికపై ఆరా తీసేందుకు ప్రయత్నించడంతో గొడవ ప్రారంభమైందని ఘటన సమయంలో అక్కడ ఉన్న తోటి అధికారి వాంగ్మూలం ఇచ్చాడు. కాగా, జర్మనీ ప్రవాసురాలు తనపై నమోదైన ఆరోపణలను నిరాకరించారు. పోలీసు అధికారే మొదట తనపై దాడి చేశారని, ప్రతిస్పందనగా మాత్రమే తాను దాడి చేసినట్టు తెలిపారు. అయితే, ఆమె ప్రవర్తన యూఏఈ చట్టాన్ని ఉల్లంఘించిందని, డ్యూటీలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగిని అవమానించడం, దాడి చేయడం తప్పని న్యాయస్థానం తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







