‘మజాకా’ నుంచి అదిరిపోయే బ్యాచ్‌లర్ యాంథమ్ రిలీజ్
- January 29, 2025ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీ(30వ సినిమా)గా రాబోతున్న చిత్రం ‘మజాకా’. ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన సత్తా చూపించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి విజయవంతమైన చిత్రాల రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ కథ, కథనం, మాటలు అందించారు.ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రాజేష్ దండ, ఉమేష్ కేఆర్ బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటుడు రావురమేష్‌కు జోడీగా ‘మన్మధుడు’ ఫేం అన్షు నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా రావు రమేష్, సందీప్ కిషన్ మధ్య వచ్చే సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పొట్టచెక్కలయ్యేలా ఉన్నాయి. ఫిబ్రవరి 21న రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి మొదటి పాట బ్యాచ్‌లర్ యాంథమ్‌ను విడుదల చేశారు మేకర్స్.
బ్యాచ్‌లర్స్ జీవితంలో ఉండే స్ట్రగుల్స్, జాయ్స్‌ను హైలైట్ చేసేలా ఉన్న ఈ సాంగ్ కుర్రాళ్లకు చార్ట్‌బస్టర్ కానుంది. పాపులర్ రైటర్ రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట కుర్రాళ్లకు ఎవర్‌గ్రీన్ ఫేవరెట్ కానుంది. ఈ పాటలో బ్యాచ్‌లర్స్ తమ జీవితంలో పడే వంట కష్టాలు, సింగిల్ షాపింగ్ ట్రిప్స్ వంటి వాటిని చాలాబాగా ఎలివేట్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ధనుంజయ్ సీపాన ఎంతో హుషారుగా ఆలపించారు. కుర్రాళ్లందరికీ కనెక్ట్ అయ్యేలా తన గాత్రంతో కట్టిపడేశారు. లియోన్ జేమ్స్ అందించిన సంగీతం పాటకు మరింత ప్లస్ అయింది. రఘు మాస్టర్ అందించిన స్టెప్పులతో ఈ పాట సినిమాలో హైలైట్‌గా నిలవనుంది. ఈ పాటను సందీప్ కిషన్-రావు రమేష్‌లపై వైజాగ్ బీచ్‌లో చిత్రీకరించారు. తండ్రీకొడుకుల బ్యాచ్‌లర్ జీవితంలో ఎత్తుపల్లాలను కళ్లకు కట్టినట్లు చూపించేలా తీశారు. వారిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను పడిపడినవ్వేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌కు ఈ బ్యాచ్‌లర్ యాంథమ్ బ్లాక్‌బస్టర్ బిగినింగ్‌లా చెప్పొచ్చు.
తారాగణం: సందీప్ కిషన్, రీతు వర్మ, రావు రామేష్, అన్షు
సాంకేతిక బృందం:
దర్శకుడు: త్రినాధరావు నక్కిన
బ్యానర్స్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియో
నిర్మాతలు: రాజేష్ దండ, ఉమేష్ కేఆర్ బన్సల్
కథ, కథనం, డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ
సహ నిర్మాత: గుట్ట బాలాజీ
లైన్ ప్రొడ్యూసర్: పాపూరి కిరణ్
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫి
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మకడలి
స్టంట్స్: పృధ్వి
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హ్యాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







