పన్ను చెల్లింపుదారులకు బ్యాడ్ న్యూస్..
- January 30, 2025
న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారికంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. వచ్చే ఫిబ్రవరి 1న ఈ కేంద్ర బడ్జెట్ 2025ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
ఇది వరుసగా 8వ సారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు.కేంద్ర బడ్జెట్ 2025 ప్రకటనకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, కొత్త పన్ను విధానం పై పన్ను చెల్లింపుదారులు ఇప్పటికీ గందరగోళంలో ఉన్నారు.
రాబయే కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపులు ఉండకపోవచ్చు. అయితే, పన్ను చెల్లింపుదారులు ఈ బడ్జెట్పైనే గంపెడు ఆశలు పెట్టేసుకున్నారు. బడ్జెట్ 2020లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం, రాయితీతో కూడిన పన్ను రేట్లను అందిస్తున్నప్పటికీ, పాత పన్ను విధానంలో అందుబాటులో ఉండే అనేక ముఖ్యమైన పన్ను ప్రయోజనాలను అందుకోలేరు. ఇప్పటికే, కొత్త పన్ను విధానంలో పాత పన్ను విధానంలా ఎక్కువగా మినహాయింపులు ఉండవని సంగతి విధితమే.
హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) :
హౌస్ రెంట్ అలవెన్స్ కోసం అయ్యే ఖర్చులకు యజమాని ద్వారా ఉద్యోగికి ఇవ్వడం జరుగుతుంది. పాత విధానంలో పన్ను విధించదగిన ఆదాయాన్ని లెక్కించేటప్పుడు (HRA) మినహాయింపు మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి తొలగిస్తారు. తద్వారా వ్యక్తులు పన్నులపై ఆదా చేసుకోవచ్చు.
హోమ్ లోన్పై వచ్చే వడ్డీ:
ఇది పాత పన్ను విధానంలో సెక్షన్ 24(B) కింద లభించే మరో ముఖ్యమైన మినహాయింపు. గృహ రుణంపై వచ్చే వడ్డీపై రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.
ప్రయాణ రాయితీ (LTC):
పాత పన్ను విధానంలో ఉన్న ఈ భత్యం భారతదేశ వ్యాప్తంగా ఎక్కడికైనా ప్రయాణించడానికి ఉద్యోగికి యజమాని ద్వారా ఇవ్వడం జరుగుతుంది. పన్నుల నుంచి మినహాయింపు కోసం ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 36వేలు పొందవచ్చు. ఎల్టీసీ కింద ఉద్యోగి ఎలాంటి అంతర్జాతీయ ప్రయాణాన్ని క్లెయిమ్ చేయలేరు.
పిల్లల విద్యాభత్యం (CEA):
పాత పన్ను విధానంలో ఉన్న ఈ భత్యం ఉద్యోగులకు వారి పిల్లల విద్యా ఖర్చులను కవర్ చేసేందుకు వీలుంటుంది. తద్వారా వారి ఆర్థిక భారం తగ్గుతుంది. అయితే, కొత్త పన్ను విధానంలో ఇది అందుబాటులో లేదు.
రాజకీయ పార్టీకి ఇచ్చిన విరాళాలు:
పాత పన్ను విధానంలో, సెక్షన్ 80GGB ఏదైనా విరాళాలు లేదా రాజకీయ పార్టీకి చేసిన విరాళాలకు మినహాయింపును అందిస్తుంది. అయితే, నగదు రూపంలో ఇచ్చే విరాళాలు ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపులకు అర్హులు కాదు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







