తెలంగాణలో యూనివర్సిటీ ప్రొఫెసర్లకు గుడ్‌న్యూస్‌..

- January 31, 2025 , by Maagulf
తెలంగాణలో యూనివర్సిటీ ప్రొఫెసర్లకు గుడ్‌న్యూస్‌..

హైదరాబాద్: తెలంగాణలోని యూనివర్సిటీ ప్రొఫెసర్లకు శుభవార్త.. ప్రొఫెసర్ల పదవి విరమణ వయస్సకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసును 60ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. దాంతో 60 ఏళ్లు దాటిన యూనివర్సిటీ ప్రొఫెసర్లు మరో ఐదేళ్లపాటు విధుల్లో కొనసాగనున్నారు.

ఈ ప్రొఫెసర్లకు మాత్రమే వర్తింపు:
రాష్ట్రంలోని యూనివర్శిటీల్లో అధ్యాపకుల రిటైర్మెంట్ వయసును 60ఏళ్ల నుంచి 65 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇటీవలే తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఈ కొత్త నిబంధన యూజీసీ (UGC) వేతన స్కేల్ పొందే యూనివర్శిటీ ప్రొఫెసర్లకు మాత్రమే వర్తించనుంది.

అలాగే, సాధారణ రాష్ట్ర ప్రభుత్వ వేతన స్కేలులోని యూనివర్సిటీ ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఇందుకు అర్హులు కారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్యాశాఖ పరిధిలో మొత్తం 12 వర్సిటీలున్నాయి.

73 శాతం ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీ:

అందులో మొత్తం 2,800కి పైగా ప్రొఫెసర్ పోస్టులు ఉండగా, కేవలం 757 మంది మాత్రమే పనిచేస్తున్నారు.ఇందులో 2,060 పైగా పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.దాదాపు 73శాతం ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనమాట.ఈ ఖాళీలను అత్యంత త్వరగా భర్తీ చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com