ఇందిరమ్మ ఇళ్ల తాజా అప్డేట్
- February 09, 2025
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం రోజుకో కొత్త సమాచారం అందిస్తోంది.తాజాగా, అందిన దరఖాస్తులను అధికారులు మూడు జాబితాలుగా విభజించారు. వాటిని ఎల్-1, ఎల్-2, ఎల్-3 అని వర్గీకరించారు. ఈ జాబితాల ప్రకారం, మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయనుందని స్పష్టమైన ప్రకటన వచ్చింది.
జాబితా విభజన ఇలా ఉంది: ఎల్-1 జాబితాలో సొంత స్థలంలో గుడిసె, పూరిపాక, మట్టిమిద్దెలు, రేకుల ఇళ్లలో నివాసముంటున్న వారిని చేర్చారు. ఎల్-2 జాబితాలో సొంత స్థలం లేక, పూర్తిగా ఇల్లు లేనివారు ఉన్నారు.ఎల్-3 జాబితాలో ఇప్పటికే ఇల్లు ఉన్నప్పటికీ, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు.మొత్తంగా పరిశీలించిన దరఖాస్తుల ప్రకారం ఎల్-1 జాబితాలో 21.93 లక్షలు, ఎల్-2 జాబితాలో 19.96 లక్షలు, ఎల్-3 జాబితాలో 33.87 లక్షలు ఉన్నారు. మొదటి విడతలో 562 గ్రామాల నుంచి 71,482 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో ఎల్-1 నుంచి 59,807 మంది, ఎల్-2 నుంచి 1,945 మంది, ఎల్-3 నుంచి 5,732 మంది, కొత్త దరఖాస్తుల నుంచి 3,998 మంది ఉన్నారు.
ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా, మొదటి విడతలో ప్రధానంగా సొంత స్థలం ఉన్నవారికే ఇళ్లు మంజూరు చేయనుంది. మిగిలిన ఎల్-1, ఎల్-2 జాబితాలోని లబ్ధిదారులు తర్వాతి విడతల్లో ప్రాధాన్యం పొందనున్నారు. అయితే, ఎల్-3 జాబితాలో 33.87 లక్షల మంది దరఖాస్తుదారులలో చాలా మంది ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులుగా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో లబ్ధిదారుల్లో కొంత నిరాశ వ్యక్తమవుతోంది. ప్రత్యక్షంగా ఇళ్లు అవసరమైన వారు ముందుగా ప్రాధాన్యత పొందడం న్యాయం అయినప్పటికీ, మిగిలిన వారికి కూడా సముచిత న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ప్రకటిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







