అబుదాబిలో మత్స్యకారుడికి 50,000 దిర్హామ్‌ల జరిమానా..!!

- February 22, 2025 , by Maagulf
అబుదాబిలో మత్స్యకారుడికి 50,000 దిర్హామ్‌ల జరిమానా..!!

అబుదాబి: ఫిషింగ్ కోసం అనుమతించబడిన రోజువారీ పరిమితిని మించిన  కారణంగా ఓ మత్స్యకారుడికి Dh50,000 జరిమానా విధించినట్లు అబుదాబి పర్యావరణ ఏజెన్సీ తెలిపింది. సముద్ర వనరులను రక్షించడానికి, భవిష్యత్తు తరాలకు వాటి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఏజెన్సీ ప్రయత్నాల కొనసాగింపులో ఇది భాగమని పేర్కొంది.ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక పోస్ట్‌ చేసింది.సముద్ర వనరులను సంరక్షించడానికి నిబంధనలు, చట్టాలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చింది.పర్యావరణ హానికర ఫిషింగ్ పద్ధతుల నిర్మూలన, చేపల నిల్వలను తక్కువ సమయంలో పునరుద్ధరణకు సైన్స్ ఆధారితంగా రూపొందించిన చట్టాలను అందరూ గౌరవించాలని కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com