2024లో రికార్డులు సృష్టించిన సౌదీ ఎయిర్ పోర్టులు..!!
- February 22, 2025
రియాద్: జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) విడుదల చేసిన ఎయిర్ ట్రాఫిక్ 2024 నివేదిక ప్రకారం..సౌదీ విమానాశ్రయాలు 2024లో రికార్డు స్థాయిలో 128 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించాయి. ఇది గతేడాదితో పోలిస్తే 15 శాతం పెరుగుదల కావడం గమనార్హం. ప్రీ-పాండమిక్ స్థాయిలతో పోలిస్తే 25 శాతం పెరిగింది. దేశీయ విమానాల్లో 59 మిలియన్ల మంది ప్రయాణికులు, అంతర్జాతీయ మార్గాల్లో 69 మిలియన్ల మంది ప్రయాణీకులు ప్రయాణించారు. సౌదీ విమానాశ్రయాల ద్వారా నడిచే విమానాల సంఖ్య 2023తో పోలిస్తే 11 శాతం పెరిగింది. 474,000 దేశీయ, 431,000 అంతర్జాతీయ విమానాలతో సహా మొత్తం 905,000 విమానాలకు చేరుకుంది.
ఎయిర్ కనెక్టివిటీ కూడా 16 శాతం విస్తరించింది. రాజ్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 170కిపైగా గమ్యస్థానాలకు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.అదే సమయంలో ఎయిర్ కార్గో కార్యకలాపాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి. 2024లో 34 శాతం పెరిగి 1.2 మిలియన్ టన్నులను అధిగమించాయి. రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం 573,000 టన్నులను ప్రాసెస్ చేయగా, జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 461,000 టన్నులను, డమ్మామ్‌లోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం 0140 వరకు నిర్వహించింది. రియాద్, జెద్దా, దమ్మామ్, మదీనాలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాలు మొత్తం విమాన ట్రాఫిక్‌లో 82 శాతాన్ని కలిగి ఉన్నాయి.
హజ్ సీజన్ మే 9 నుండి జూలై 21 వరకు పొడిగించగా.. 1.5 మిలియన్ల మంది యాత్రికులు రాజ్యానికి చేరుకున్నారు. విమాన ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. ఈ సంఖ్య ఆ కాలంలో మొత్తం అంతర్జాతీయ ప్రయాణికులలో 40 శాతంగా ఉంది. బ్రిటీష్ గ్లోబల్ ట్రావెల్ డేటా ప్రొవైడర్ OAG ప్రకారం.. జెడ్డా-రియాద్ మార్గం 2024లో దేశీయ మార్గాలలో ప్రపంచవ్యాప్తంగా కెపాసిటీలో అతిపెద్ద పెరుగుదలను నమోదు చేసింది. అయితే కైరో-జెడ్డా మార్గం ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ మార్గంగా నిలిచింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







