ప్రొ కబడ్డీ సీజన్-4లో జాతీయ గీతం పడనున్న 'రానా దగ్గుబాటి'
- July 03, 2016
ప్రొ కబడ్డీ సీజన్-4లో 'భల్లాలదేవ' రానా దగ్గుబాటి సందడి చేయనున్నారు. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రానా.. ఆదివారం సొంతగడ్డపై జరిగే మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం ఆలపించనున్నారు. ఆదివారం టైటాన్స్ జట్టు పట్నా పైరేట్స్‌తో తలపడనుంది. రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి. మిగతా మూడు రోజుల్లో ముధుమిత మోహపాత్ర, రకుల్ ప్రీత్‌సింగ్, మెర్లిన్ డిసౌజా జాతీయగీతం ఆలపించనున్నారు.
రానా.. తెలుగు టైటాన్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సీజన్ 4లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ పరాజయం పొందిన టైటాన్స్ జట్టు.. నేటి నుంచి సొంతగడ్డపై పోటీ పడనుంది. హైదరాబాద్‌లో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఇక హైదరాబాద్‌లోనే రానా జట్టు, కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ జట్టుతో తలపడనుంది. జులై 5న టైటాన్స్.. బెంగళూరు బుల్స్ మ్యాచ్ జరగనుంది.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







