#Sharwa36 నుంచి లుక్ రిలీజ్
- March 06, 2025చార్మింగ్ స్టార్ శర్వా తన 36వ మూవీ #Sharwa36 లో స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్ గా కనిపించబోతున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వం లో ప్రతిష్టాత్మక UV క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. త్వరలోనే టైటిల్ ను లాంచ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
శర్వాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ సినిమాలో అతని లుక్ ను రివిల్ చేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. టోర్న్ జీన్స్, స్టైలిష్ స్పోర్ట్స్ జాకెట్, షేడ్స్ ధరించి యమహా RX-100 బైక్ పై కూర్చున్న శర్వా లుక్ అదిరిపోయింది. శర్వా కూల్ అండ్ ఎనర్జిటిక్ వైబ్ తో కనిపించిన ఈ లుక్ ఛరిస్మాటిక్ గా వుంది.
వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకునే శర్వా, ఈ చిత్రంలో మరో సవాలుతో కూడిన పాత్రను పోషిస్తున్నారు. ఈసారి, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆడ్రినలిన్ రష్‌ని ఇచ్చే స్టంట్స్ తో అదరగొట్టబోతున్నారు.
ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయికగా నటించగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ హై-ఎనర్జీ చిత్రం మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది, మూడు తరాల నేపధ్యంలో ఒక కుటుంబం, ప్రేమ, కలలతో ముడిపడి 90s, 2000s ప్రారంభంలోని ఎక్సయిటింగ్ మోటోక్రాస్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న అద్భుతమైన కథ.
ఈ చిత్రానికి జె యువరాజ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూ, ఎక్సయిటింగ్ విజువల్స్ ని అందిస్తున్నారు. గిబ్రాన్ ఈ చిత్రానికి డైనమిక్ సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేస్తున్నారు. అనిల్ కుమార్ పి ఎడిటర్‌గా, ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్, ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అభిలాష్ కంకర
నిర్మాతలు: వంశీ-ప్రమోద్
సమర్పణ: విక్రమ్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: జిబ్రాన్
డీవోపీ: J యువరాజ్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఎడిటర్: అనిల్ కుమార్ పి
ఆర్ట్ డైరెక్టర్: ఎ పనీర్ సెల్వం
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







