'ఛావా' గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా 550+ స్క్రీన్లలో గ్రాండ్ రిలీజ్
- March 07, 2025
ఛత్రపతి శంభాజీ మహారాజ్ ధైర్యసాహసాలను చాటిన సినిమాటిక్ మాస్టర్ పీస్ 'ఛావా' హిందీలో భారీ విజయం సాధించిన తర్వాత రేపు తెలుగులో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో దినేష్ విజన్ మాడ్డాక్ ఫిల్మ్స్ నిర్మించిన 'ఛావా'లో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రను ట్యాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ అద్భుతంగా పోషించారు.
ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పింది. తెలుగు ట్రైలర్ దాదాపు 5 మిలియన్ల వ్యూస్ సాధించి రిలీజ్ కోసం మరింత ఉత్సాహాన్ని పెంచింది. ఛావా తెలుగు వెర్షన్ 550+ స్క్రీన్లలో గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీని వసూళ్లు రూ. 700 కోట్లకు చేరువలో ఉన్నాయి, ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో స్థానాన్ని పదిలం చేసుకుంది
వీడియో మెసేజ్ లో విక్కీ కౌశల్ మాట్లాడుతూ..మా సినిమా ఛావా పట్ల మీ అద్భుతమైన సపోర్ట్, ప్రేమకు ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొదటి వారం నుండి ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేయడానికి మాకు చాలా డిమాండ్ రావడం ప్రారంభమైంది. మార్చి 7న మా ఛావా చిత్రాన్ని తెలుగులో మీ ముందుకు తీసుకురావడానికి మేము గర్విస్తున్నాము. ఛావా మీ హృదయాలను తాకుతుందని, గొప్ప మరాఠా యోధులలో ఒకరైన చత్రపతి శంభాజీ మహారాజ్ కీర్తి, అజేయమైన శౌర్యం, త్యాగాన్ని చూసే అవకాశం మీకు లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. మీరందరూ బిగ్ స్క్రీన్ పై ఎక్స్ పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను'అన్నారు.
ఎన్నో బ్లాక్‌బస్టర్‌లను అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ సహకారంతో 'ఛావా' తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
ఆకట్టుకునే కథనం, అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ఛత్రపతి శంభాజీ మహారాజ్ వారసత్వానికి హృదయపూర్వక నివాళిగా వుండే ఈ చిత్రంలో రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, డయానా పెంటీ, అశుతోష్ రాణా, దివ్య దత్తా ముఖ్యమైన పాత్రల్లో నటించారు.
గెట్ రెడీ- ఛావా తెలుగు సినిమాలో సంచలనం సృష్టించబోతోంది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







