పెళ్లి కాని ప్రసాద్ హైలీ ఎంటర్టైనింగ్ ట్రైలర్ విడుదల
- March 13, 2025సప్తగిరి హోల్సమ్ ఎంటర్ టైనర్ 'పెళ్లి కాని ప్రసాద్' మార్చి 21న థియేటర్లలోకి రానుంది. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్ , సోషల్ కామెంటరీ బ్లెండ్ తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది.థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది. దిల్ రాజు నేతృత్వంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది.ఈరోజు మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ప్రసాద్ కి 36 ఏళ్ళు దాటుతాయి.పెళ్లి గురించి మరింత ఆందోళన చెందుతాడు. అతను ఏజ్ బార్ గా భావిస్తున్నప్పటికీ, కాలక్రమేణా ఎక్కువ అనుభవం వస్తుందని అతని తండ్రి అతనికి భరోసా ఇస్తాడు. అయినప్పటికీ, ఇంకేదైనా ఆలస్యం జరిగితే ఇక అవకాశం వుండదని ప్రసాద్ భయపడతాడు. మరోవైపు, హీరోయిన్ కుటుంబం తనకు మద్దతు ఇవ్వడమే కాకుండా, తన మొత్తం కుటుంబాన్ని పోషించగల వరుడి కోసం వెతుకుతోంది. వీరిని విధి ఒకచోట చేర్చుతుందా? అనేది ట్రైలర్ లో చాలా ఎక్సయిటింగ్ అండ్ హిలేరియస్ గా ప్రజెంట్ చేశారు.
పెల్లి కాని ప్రసాద్ టైటిల్ పాత్రలో సప్తగిరి తన హ్యుమరస్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ప్రియాంక శర్మకు మంచి పాత్ర లభించింది. మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ పాత్రలు కామెడీ పోర్షన్ ని మరింత పెంచింది.
సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ సినిమా ఎంటర్టైమెంట్ ప్రిమైజ్ ని అద్భుతంగా చూపిస్తోంది. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర సంగీతం హ్యుమర్ ని మరింత ఎలివేట్ చేసింది. ఎడిటర్ మధు.
మొత్తం మీద, పెళ్లి కాని ప్రసాద్ ప్రేక్షకులను నవ్విస్తూ సామాజిక నిబంధనలను ప్రజెంట్ చేసే ఎంటర్ టైనింగ్ ఔటింగ్ గా ఉండబోతోంది.
తారాగణం: సప్తగిరి, ప్రియాంక శర్మ, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్, అన్నపూర్ణమ, ప్రమోదిని, బాషా, శ్రీనివాస్, ప్రభావతి, రోహిణి, రాంప్రసాద్
సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడి
నిర్మాతలు: K.Y.బాబు (విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల
బ్యానర్: థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ: చాగంటి సినిమా వరల్డ్
రిలీజ్: SVC
డిఓపి: సుజాత సిద్దార్థ్
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: మధు
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







