సౌదీలో రాబోయే మూడు రోజులపాటు భారీ వర్షాలు..!!
- March 14, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలలో శుక్రవారం నుండి సోమవారం వరకు ఒక మోస్తరు నుండి భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. మక్కా ప్రాంతంలోని గవర్నరేట్లలో దుమ్ము తుఫానుతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షం, ఆకస్మిక వరదలు, వడగళ్ళు కురిసే అవకాశం ఉంది. ఈ గవర్నరేట్లలో మక్కా నగరం, అల్-జుముమ్, కమిల్, తైఫ్, మైసాన్, అధమ్, అల్-అర్దియత్, అల్-మావియా, అల్-ఖోర్మా, రానియా, తుర్బా ఉన్నాయి.
మదీనా ప్రాంతంలోని అల్-ఉలా, అల్-ఐస్, బదర్, మదీనా, ఖైబర్, అల్-హనకియా, వాడి అల్-ఫరా మరియు అల్-మహద్ వంటి చాలా గవర్నరేట్లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. తబుక్ ప్రాంతంలోని తైమాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షంతో పాటు దుమ్ము, ఆకస్మిక వరదలు, వడగళ్ళు, అధిక అలలు ఉంటాయన్నారు.
రియాద్, ఖాసిం, హైల్, నజ్రాన్, తూర్పు ప్రావిన్స్, ఉత్తర సరిహద్దులు, అల్-జౌఫ్, అల్-బహా, జాజాన్ ప్రాంతాలలో దుమ్ము తుఫానులతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. ప్రజలు వాతావరణ సూచనలను అనుసరించి తమ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకోవాలని చాలని కేంద్రం పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







