సునాముఖి ఆకు ప్రయోజనాలు
- March 06, 2018సునాముఖి ఆకు ప్రయోజనాలు అనేకం. ఏ పదార్ధంతో కలిపి తీసుకుంటుంన్నాం అనే దాని మీద దాని ప్రయోజనాలు మారుతూ ఉంటాయి. అదెలా అంటే, ఒక స్పూన్ సునాముఖి ఆకు చూర్ణాన్ని, అరకప్పు వేడి ఆవుపాలతో కలిపి సేవిస్తే రక్త శుద్ధి కలుగుతుంది. శరీరం కూడా కాంతిమంతమవుతుంది.
నేతితో సేవిస్తే శరీరంలోని అనేక రుగ్మతలు పోతాయి. పంచదారతో సేవిస్తే వాతం తగ్గుతుంది. తేనెతో సేవిస్తే ధాతుపుష్టి కలుగుతుంది. మేక పాలతో తీసుకుంటే శరీరం బలిష్టమవుతుంది. పాత బెల్లంతో తీసుకుంటే జలుబు తగ్గుతుంది. గుంటగలగరాకు రసంతో అయితే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి. ద్రాక్షపండు రసంతో తీసుకుంటే కంటి తేజస్సు పెరుగుతుంది.
1. 3 గ్రాముల సునాముఖి ఆకు చూర్ణానికి సమానంగా పటికబెల్లం కలిపి రోజుకి రెండుపూటలా సేవిస్తే శరీర పుష్టి కలుగుతుంది.
2. 10 గ్రాముల సునాముఖి ఆకు చూర్ణాన్ని రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లతో సేవిస్తే, సుఖ విరేచనం కలుగుతుంది.
3. రెండున్నర గ్రాముల సునాముఖి ఆకు చూర్ణానికి సమానంగా ఫిరంగి చెక్క చూర్ణం కలిపి 40 రోజులు వాడితే కండ్ల జబ్బులు నయమవుతాయి.
4. 5 గ్రాముల ఆకు చూర్ణానికి 10 గ్రాముల దోసగింజల చూర్ణం కలిపి సేవిస్తే మూత్రద్వారానికి అడ్డుపడే రాళ్లు కరిగిపోతాయి.
5. 10 గ్రాముల సునాముఖి ఆకు చూర్ణాన్ని ఆవు నెయ్యితో కలిపి తింటూ వుంటే అన్ని రకాల ఒంటి నొప్పులు తగ్గుతాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్‌లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్‌లో కోట్ల విలువైన వజ్రాలు..