పల్లీ బర్పీ

పల్లీ బర్పీ

కావలసిన పదార్థాలు
వేగించిన పల్లీలు- పావు కిలో, చక్కెర- 150 గ్రా., కుంకుమ పువ్వు- చిటికెడు, నెయ్యి- ఒక టేబుల్‌ స్పూను, బాదం, పిస్తాలు- అర కప్పు, నీళ్లు- రెండు గ్లాసులు.
తయారీ విధానం
వేగించిన పల్లీలను మిక్సీలో మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో చక్కెర, నీళ్లు పోసి పాకం పట్టాలి. తర్వాత ఉండకట్టకుండా చెంచాతో కలుపుతూ పల్లీల పొడి వేయాలి. పొడి పాకంలో బాగా కలిసిపోయి చిక్కబడిన తర్వాత నెతిలో వేగించిన బాదం, పిస్తాలు, కుంకుమ పువ్వు వేసి దించేయాలి. ఒక ప్లేటులో ఈ మిశ్రమాన్ని సమానంగా పోసి చల్లారిన తర్వాత నచ్చిన ఆకారంలో కత్తిరించుకోవాలి.

Back to Top