Date:Receipe
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
కర్జూర పాయసం

కర్జూర పాయసం

కావలసినవి: కర్జూరాలు - 3/4 కప్పు, పాలు - రెండు కప్పులు, నీళ్లు - ఒకటిన్నర కప్పు, నెయ్యి - ఒక టీస్పూన్‌, జీడిపప్పు పలుకులు - పన్నెండు, ఎండుద్రాక్షలు - అరటేబుల్‌ స్పూన్‌, యాలకలపొడి - అర టీస్పూన్‌.
 
తయారీ: కర్జూరాల్లో గింజలు తీసి సన్నటి ముక్కలుగా తరగాలి. కర్జూరాలు ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంచినట్టయితే వాటిని ముందు రోజు బయట పెట్టాలి. ఒక గిన్నెలో పాలు వేడిచేయాలి. మరో పాన్‌లో నెయ్యి వేడిచేసి జీడిపప్పు పలుకులు, ఎండుద్రాక్షలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేగించి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో కర్జూర తరుగు వేసి ఓ నిమిషం పాటు వేగించాలి. తరువాత నీళ్లు పోసి కర్జూర ముక్కలు గుజ్జులా అయ్యే వరకు ఉడికించాలి. దాన్ని అలానే సన్నటి మంట మీద ఉంచితే పదినిమిషాల్లో చిక్కపడుతుంది. చిక్కపడిన మిశ్రమంలో పాలు పోసి బాగా ఉడికించాలి. చివర్లో వేగించిన జీడిపప్పు పలుకులు, ఎండుద్రాక్షలు, యాలకలపొడి వేసి మరో ఐదు నిమిషాలు సన్నటి మంట మీద ఉంచితే కర్జూర పాయసం రెడీ.
చల్లగా, వేడిగా ఎలా అయినా తినొచ్చు. బాగా తీపి ఇష్టపడేవాళ్లు అదనంగా రెండు టేబుల్‌ స్పూన్ల పంచదార లేదా రెండు టేబుల్‌ స్పూన్ల కండెన్స్‌ మిల్క్‌ కలుపుకోవచ్చు. వెగానిజమ్‌ అనుసరిస్తున్న వాళ్లు జీడిపప్పులు, ఎండుద్రాక్షల్ని ఒక టీస్పూన్‌ నూనెలో వేగించుకోవాలి. లేదా డ్రై రోస్ట్‌ చేసుకోవాలి. పాలకు బదులు కొబ్బరి పాలు వాడుకోవాలి.